మీ అప్పుకి - పాస్ పోర్ట్ కు లింక్ పెట్టేశారు

Submitted on 1 January 2019
Change passport terms : madras high court

చెన్నై: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పు తీసుకున్న వారు దేశం విడిచి పారిపోకుండా పాస్ పోర్టు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ’అప్పు ఎగవేత దారులు చట్టం నుంచి తప్పించుకునేందుకు సుదూర దేశాలకు పారిపోతున్నారు. వారు తమ పాస్ పోర్టులను అప్పు పొందిన బ్యాంకు లేదా సంస్థ వద్ద సరెండర్ చేసేలా నిబంధనలు మార్చాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. తనను విధుల నుంచి తొలగించడం అన్యాయమంటూ ఓ అంగన్ వాడీ కార్యకర్త వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు పై విధంగా వ్యాఖ్యలు చేసింది.

’అప్పు పూర్తిగా చెల్లించేవరకు పాస్ పోర్టు అప్పుతీసుకున్న వ్యక్తి వద్దే ఉండాలి. ఉంచకపోతే పాస్ పోర్టు తాత్కాలికంగా రద్దు చేయాలని, పాస్ పోర్టు రెన్యూవల్ కు కోర్టు అనుమతి ఉండాలి’ అని తెలిపింది. మంగళం అనే అంగన్ వాడీ కార్యకర్త అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తన బంధువు పాస్ పోర్టుతో సింగపూర్ వెళ్లింది. ప్రభుత్వం ఆమెను విధుల నుంచి తొలగించింది. తనను విధుల నుంచి తొలగించడంపై మంగళం కోర్టుకు వెళ్లింది. దీంతో కోర్టు ఆమెను మందలిస్తూ వారం రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మంగళంతోపాటు ఆమె బంధువుకు రేషన్ కార్డు తదితర ప్రభుత్వ సౌకర్యాలను ఉపసంహరించాలని కోర్టు తెలిపింది.
 

Change
passport terms
madras high court
anganvadi karyakarta

మరిన్ని వార్తలు