బ్రోచేవారెవరురా టైటిల్ లుక్

Submitted on 31 December 2018
Brochevarevarura Tittle Look -10TV

హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా, సినిమా సినిమాకీ నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ కెరీర్‌ని కంటిన్యూ చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఇంతకు ముందు తనతో, మెంటల్ మదిలో సినిమా చేసిన వివేక్ ఆత్రేయతో కలిసి, బ్రోచేవారెవరురా అనే సినిమా చేస్తున్నాడు శ్రీ విష్ణు. మన్యం క్రియేషన్స్ బ్యానర్‌పై, మన్యం విజయ్ కుమార్ నిర్మిస్తుండగా, నివేథా థామస్, నివేథా పేతురాజ్ ఫీమేల్ లీడ్స్‌గా చేస్తున్నారు. సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. 

క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేసారు మేకర్స్. బ్రోచేవారెవరురా అనే టైటిలే అచ్చ తెలుగులో, అందులోనూ వెరైటీగా ఉందనుకుంటే, దానికి.. చలనమే చిత్రము, చిత్రమే చలనము అనే ఢిఫరెంట్ ట్యాగ్ లైన్ పెట్టారు. ఒక దిష్టి బొమ్మని మాత్రమే చూపించారు పోస్టర్‌లో. ఆ దిష్టి బొమ్మ పోస్టర్‌ని చూస్తూ, ముఖానికి ఖర్చీఫ్‌లు కట్టుకుని ఉన్న ముగ్గురు వ్యక్తులు భయంతో పరిగెడుతున్నారు.

ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, ఈ 2019లో మీకెవ్వరికీ తగలకూడదని ఆశిస్తూ.. శుభంభూయాత్.. అనే మేటర్ పోస్టర్‌పై రాయటం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మొత్తానికి బ్రోచేవారెవరురా టీమ్, ఆడియన్స్‌కి నూతన సంవత్సర శుభాకాంక్షలు వెరైటీగా చెప్పిందన్న మాట.

Brochevarevarura
Brochevarevarura Tittle Look
Sree Vishnu
Nivetha Thomas
Nivetha Pethuraj
Manyam Vijay Kumar
Vivek Athreya

మరిన్ని వార్తలు