బంగ్లాదేశ్ ఎన్నికలు : మరోసారి అధికారంలోకి షేక్ హసీనా..

Submitted on 31 December 2018
Bangladesh Elections, Sheikh Hasina, Once Again in Power in Bangaldesh Elections

ఢాకా : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా మరోసారి విజయదుందుభి మోగించారు.  మొత్తం 298 అసెంబ్లీ సీట్లకు గాను 287 స్థానాలను కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేశారు. తమ విజయంపై మొదటి నుండి ధీమాగా వున్న షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ పార్టీ అద్వితీయ విజయాన్ని సాధించింది. 2014 ఎన్నికలను బాయ్‌కాట్ చేసిన ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఈ ఎన్నికల్లో కేవలం ఆరు సీట్లతో సరిపెట్టుకోవటంతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఎన్నికల్లో అవామీ లీగ్ గెలిచినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.  దేశంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఆరు ప్రాంతాల్లో ఉపయోగించడం..229 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆరు ప్రాంతాల్లో ఈవీఎంలను వినియోగించిన ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

హింసాత్మకంగా మారిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో అవామీ లీగ్‌ యూత్ విభాగమైన జుబో లీగ్ జనరల్ సెక్రటరీ మహ్మద్ బషీరుద్దీన్ తో పాటు రాజ్‌షాహి, చిత్తగావ్‌, కుమిల్లా, కాక్స్‌బజార్‌ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తుల చొప్పున..బ్రమ్మణబెరియా, రంగమతి, నార్సిది, బొగుర, గజీపూర్‌, సిల్హెట్‌లో చెలరేగిన అల్లర్లు వంటి పలు సంఘటనలు జరిగిన క్రమంలో వివిధ ప్రాంతాల్లో చనిపోయినవారు మొత్తంగా  17 మంది మృతి చెందినట్లుగా పోలీసులు అధికారికంగా తెలిపారు.  అధికార, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఎక్కువ మంది మృతి చెందగా..పోలీసుల కాల్పుల్లో మరో ముగ్గురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఎక్కువమంది అధికార పార్టీకి చెందిన కార్యకర్తలే ఉన్నారు.


లక్షలాది మంది రోహింజ్యా ముస్లింలు మయన్మార్ నుంచి వలస రావటంతో బంగ్లాదేశ్ అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయ్యింది. షేక్ హసీనాకు దీర్ఘకాలంగా ప్రత్యర్థిగా ఉన్న ఖలీదా జియా ఈ ఏడాది మొదల్లో అవినీతి నేరారోపణల నేపథ్యంలో జైలు పాలవటంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోవటం..ఇదంతా రాజకీయ దురుద్దేశ్యంతో జరిగిన కుట్ర అని ఖలీదా జియా అప్పట్లో ఆరోపించారు. ఈ క్రమంలో అవామీ లీగ్ పార్టీ అద్వితీయ విజయంతో షేక్ హసీనా మరోసారి ప్రధానిగా అధికారాన్ని చేపట్టనున్నారు. 

Bangladesh Elections
Sheikh Hasina
Once Again in Power in Bangaldesh Elections

మరిన్ని వార్తలు