మన్యం వీరుడు, తెలుగు రాంబో - లుక్స్ అదుర్స్

Submitted on 31 December 2018
Ram Charan, Mega Power Star, NTR Biopic movie, New poster Release of NTR movie, Ram Charan New Look, Balakrishna new loook of NTR movie

స్వర్గీయ జీవిత కథతో, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు రెండు పార్ట్‌‌లుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌కీ, ఆడియోకీ మంచి స్పందన వస్తుంది. ఫస్ట్ పార్ట్  కథానాయకుడు రిలీజ్‌కి తక్కువ టైమ్ ఉండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. ఇప్పటికే బాలయ్య రకరకాల గెటప్స్‌లో ఉన్న పోస్టర్స్ రిలీజ్ చేసిన మేకర్స్, నిన్న ఎన్టీఆర్ కథానాయకుడు నుండి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఆ పోస్టర్‌లో బాలయ్య, మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు గెటప్‌లో ఉన్నాడు. విల్లు పట్టుకుని అంతే ఠీవీగా నిలబడి ఉన్న బాలయ్య లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న సినిమా,  వినయ విధేయ రామ.. నిన్న ఈ సినిమా నుండి చెర్రీ న్యూ లుక్ రిలీజ్ అయ్యింది. ఆ లుక్‌లో చరణ్‌ని చూసి అందరూ షాక్ అయ్యారు. షర్ట్ లెస్‌గా ఒంటి నిండా టాటూలతో, భారీ మిషన్ గన్‌లాంటిది పట్టుకుని, విలన్ల భరతం పడుతున్నట్టు యమా సీరియస్‌గా, తెలుగు రాంబోలా ఉన్నాడు చరణ్. చూస్తుంటే, బోయపాటి, చెర్రీలోని మాస్ యాంగిల్ మొత్తాన్నీ బయటకి తీసినట్టున్నాడు.

ఈ కొత్త పోస్టర్ మెగాభిమానులను ఆకట్టుకుంటుంది. 2019 జనవరి 9న మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజవబోతుండగా, జనవరి 11న, వినయ విధేయ రామ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Ram Charan
Mega Power Star
NTR Biopic movie
New poster Release of NTR movie
Ram Charan New Look
Balakrishna new loook of NTR movie

మరిన్ని వార్తలు