చౌడుమట్టిలో సబ్బును కనిపెట్టారు : ప్రొ. కంచ ఐలయ్య

21:51 - August 29, 2015

మన దేశంలో వర్ణ వ్యవస్థ కుట్రకు ఎందరో అనగారిన వర్గాల వారు బలి పశువులు అయ్యారు. బానిసలుగా బతుకు వెళ్లదీశారు. తరతరాలుగా వారి శ్రమ దోపిడి గురైంది. సంఘంలో వారిని కనీసం మనుషులుగా గుర్తించి .. గౌరవించలేదు. అలాంటి వారిలో చాకలోళ్లు ఒకరు. అన్ని కులాల వారి బట్టను ఉతికి శుభ్రపరిచే.. చాకలోళ్ల పని తనం నిరాధరణకు గురైంది. చాకలోళ్ల చారిత్రక నేపథ్యం, వారికి జరిగిన చారిత్రక విద్రోహం వంటి పలు అంశాలపై ప్రముఖ విశ్లేషకులు ప్రొ.కంచ ఐలయ్య విశ్లేషించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
చాకలి వాడలో సోషలిస్టు కిచెన్..
''చాకలి వారు..దినం మొత్తం బట్టలు ఉతుకుతారు. కస్టమర్స్ దగ్గర అన్నం, గటక, తీసుకెళ్తారు. అందరి ఇళ్ల నుంచి అన్నం, కూర తెచ్చి.. కుటుంబం మొత్తం తినేవారు. మొదటగా వారికి వంట గది అంటూ లేదు. అందరు ఇచ్చిన తిండిని చాకలి వారు తిన్నారు. చాకలి తెలివి.. చువుకున్నవారికంటే గొప్పది. మానవులు బట్టలు తొడుక్కున్న తర్వాత మాసిపోతాయి. వాటిని చాకలి వారే శుభ్రం చేయాలి. శుభ్రమైన బట్టలు వేసుకుంటే... ఆ రోజంతా చురుకుగా పని చేస్తారు. చాకలి స్త్రీలు..లీడ్ తీసుకున్నారు. చౌడుమట్టిలో సబ్బును కనిపెట్టారు. చౌడుమట్టితో ఉతికితే బట్టలు తెల్లగా అవుతాయి. కానీ క్రిములు పోవు.. అప్పుడు వేడినీటిలో బట్టలను ఉడకపెట్టి ఉతికారు. గ్రామ ప్రజలు ఆర్యోగంగా బతకడానికి ఒక రకంగా చాకలి వారే కారణం. ఋగ్వేదం రాసిన తర్వాత..శూద్రులను వృత్తుల వారిగా విభజించారు. వృత్తి వారికి స్టేటస్ కల్పించారు. అందరూ ఇచ్చిన ఆహారాన్ని తింటారు. చాకలి వాడలో సోషలిస్టు కిచెన్ ఉండేది. చాకలి వృత్తిలో సోషలిస్టు స్వభావం.. శ్రమ గౌరవం ఉంది. చాకలి వృత్తిలో స్త్రీ, పురుషల సమానత్వం ఉంది. ప్రబంధ కావ్యాల వల్ల సమాజం మారదు. చాకలి, మంగలి, మాల, మాదిగలు వంటి వృత్తులు చేసే కులాల గురించి పాఠ్యాంశాలుగా చేర్చాలి.. తాత్వికపోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. చాకలి కులస్తులకు ఆత్మగౌరవం కల్పించాలి.. బెస్టు క్లాస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.. వారి పిల్లలను ఇంగ్లీష్ విద్యను అందించాలి.. ఎల్ కేజీ నుంచి పిజి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి. రిజర్వేషన్ ఒక్కటే పరిష్కారం కాదు. ఎడ్యుకేషన్, సమానవత్వం, మార్పు రావాలి' అని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలను వీడియాలో చూద్దాం...

 

Don't Miss