ప్రత్యేకహోదాపై రాజకీయ నిర్ణయం జరగాలి : బివి.రాఘవులు

12:59 - September 20, 2015

ఎపికి ప్రత్యేకహోదాపై రాజకీయ నిర్ణయం జరగాలని.... అప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అభిప్రాయపడ్డారు. ఇదే అంశాలపై నిర్వహించిన 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' విశ్లేషణ కార్యక్రమంలో రాఘవులు పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేకహోదా, ప్యాకేజీలు వంటి అంశాలను రాజకీయంగా పరిష్కారం చేయాలి తప్ప.. ఎవరికి నచ్చిట్లు వారు చేయాలంటే సాధ్యం కాదన్నారు. ప్రత్యేకహోదా అంశం ఒప్పందం ప్రకారం జరగాలంటే దానిపై రాజకీయమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలు అందులోకి వస్తాయన్నారు. 'ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, స్పెషల్ స్టేటస్ డెవలప్ మెంట్ సపోర్టు' అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగస్టు 26 న కేంద్రపభుత్వానికి ఒక మెమోరండాన్ని సమర్పించారు. ఈ మెమోరండంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక సాయం కావాలి. ఏఏ అంశాల ప్రాతిపదికన సాయం అవసరమవుతుందనే అంశాలను ఆయన దీని మీద కేంద్రప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుంది. ఇంతకు ఆ మెమోరండంలో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అంశాలన్నీ ఉన్నాయా.. అనే అంశాలపై రాఘవులు మాట్లాడారు.
మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే...
ఎపికి ప్రత్యేకహోదా ఎందుకు ప్రకటించరూ.?
ఎపికి ప్రత్యేకహోదా ప్రకటన విషయంలో అరవింద్ పనగారియాకు, నీతి ఆయోగ్ కు సంబంధం లేదు. నీతి ఆయోగ్ ఒక థింక్ ట్యాంక్ లాంటిది.. వారికి తోచింది చెబుతారు. దాన్ని కేంద్రం పాటించవచ్చు., పాటించకపోవచ్చు. ప్లానింగ్ కమిషన్ కు ఉన్న హక్కులు, శక్తి.. నీతి ఆయోగ్ కు లేవు. నీతి ఆయోగ్ కేవలం ఆలోచన చేసే బృందం మాత్రమే.. అంతకుమించి దానికి ఎక్కువ విలువ లేదు. వారి ఆలోచనలు ప్రభుత్వంపై ప్రభావం చూపే పరిస్థితి లేదు. పనగారియా సలహా అడిగి బీహార్ కు ప్రత్యేకోహోదా ప్రకటన చేయలేదు. బీహార్ కు లక్షా 15 వేల కోట్ల రూపాయల ప్రత్యేకప్యాకేజీ ప్రకటించిన కేంద్రం.... ప్రత్యేకోహోదా కోసం 18 నెలలుగా పోరాటం చేస్తున్న ఎపికి ఎందుకు ప్రకటించలేదు. బీహార్ లో ఎన్నికల కోసం కేంద్రం ప్రత్యేకప్యాకేజీ ప్రకటన చేశారు. ఇది రాజకీయ నిర్ణయం. ఎపికి ప్రత్యేకహోదాపై ఒక రాజకీయ నిర్ణయం ఎందుకు చేయించలేకపోతున్నారు. ఎపికి ప్రత్యేకోహోదా ఇవ్వండి.. ఆ లోగా ప్రత్యేకప్యాకేజీ ప్రకటించండని సీఎం చంద్రబాబు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేద..? బీహార్ కు ఏ ప్రాతిపదిక మీద కేంద్రం.. లక్షా 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఎపికి ఎందుకు ఇవ్వదు..? సంస్కరణలు గట్టిగా రావాలనుకునే వారు రాష్ట్ర హక్కులను ఎలా రక్షిస్తారు. వారు రాయితీలు ఇచ్చే అవకాశమే లేదు. ఎపి సర్కార్ రాజధాని నిర్మాణంపై పెట్టిన దృష్టి... ప్రత్యేకహోదాపై పెట్టడం లేదు'. అని అన్నారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss