రాజధాని శంకుస్థాపన ఇంత అట్టహాసం అవసరమా ? - రాఘవులు..

10:11 - October 11, 2015

అమరావతి శంకుస్థాపన ఇంత అట్టహాసంగా చేయడం అవసరమా అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పేర్కొన్నారు. శంకుస్థాపనకు సిద్ధమైన అమరావతి రాజధాని నగర ప్రణాళిక పూర్తిగా సిద్ధంగా ఉందా ? భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందా ? వంటి అంశాలపై టెన్ టివిలో 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' కార్యక్రమంలో రాఘవులు విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..
'శంకుస్థాపన ఇంత అట్టహాసంగా నిర్వహించడం అవసరమా ? ఇబ్బందుల్లో ఉన్నామని చెబుతూ రాష్ట్ర, దేశ, విదేశీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఆర్భాటంలో అసలు సమస్యలు గుర్తించరని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయానికివ స్తే రాజధానిలో నిర్మాణ సమస్యలున్నాయి. విధానపరమైన సమస్యలున్నాయి. భూ సేకరణ విషయంలో సమస్యలున్నాయి. 33వేల ఎకరాలకు సంబంధించిన సమస్యలున్నాయి. భూసమీకరణలో కొంతమంది స్వచ్ఛందంగా అంగీకరించి పత్రాలు ఇచ్చారు. కొంతమంది అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. కొంతమంది కోర్టుకు వెళ్లారు. సేకరణ..సమీకరణ ఇంకా వివాదాస్పదంగానే ఉంది. సవరించిన ఆర్డినెన్స్ ప్రకారం తీసుకోవాలా ? అనే మీ మాంసలో ఉన్నారు.

లోకల్ టాలెంట్ ను ఉపయోగించుకోరా ?
భూ సమీకరణ సమస్య అసంపూర్ణంగా..అసంతృప్తిగా ఉంది. పెద్ద పెద్ద అంతస్తులు నిర్మాణాలు చేస్తున్నారు. డబ్బులకే ఇస్తారు. ఉచితంగా ఇవ్వరు. ధనవంతుల ఇళ్లలో పనిచేసే వారు నివాసాలు ఎక్కడుంటాయి. ? సింగపూర్ లో ఉన్న పేద వాడికి ఎక్కువ ఆదాయం ఉంది. వ్యవసాయ పరిరక్షణ జోన్ లు పెద్ద మోసపూరితమైంది. అంతర్జాతీయంగా ఎలా ఉందో ఇక్కడ అలా జరగాలి. వ్యవసాయ పరిరక్షణ ప్రాంతాలు నిలవవు. రైతులు అంగీకరించరు. రైతుల నుండి భూములు సేకరించి గోల్ఫ్ కోర్సులు..విల్లాలు చేస్తారా ? విదేశీ కంపెనీలు తీసుకొస్తున్నారు. లోకల్ టాలెంట్ ను వినియోగించుకోరా ?

పర్యావరణ సమస్యలపై అవగాహన లేదు..
నూజివీడులో రాజధాని అనడంతో భూములు కొన్నారు. ఇక రాజధానికి నీళ్లు అవసరం. పట్టిసీమ ద్వారా నీళ్లు తరలిస్తారని అంటున్నారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్ పెడుతామని పేర్కొంటున్నారు. ఉచితంగా నీళ్లు ఇవ్వాల్సిన వారు చాలా మంది ఉన్నారు. వీటీపీఎస్ రాజధాని కేంద్రం అవుతుంది. వీటీపీఎస్ నుండి వెలువడే దుమ్ము..ధూళి అంతా రాజధాని ప్రాంతం మీదుగా వెళుతుంది. రాజధానిలో పర్యావరణ సమస్యలపై అవగాహన లేదు. ప్రజల రాజధాని అంటున్నారు. సామాన్య మానవుడు స్వేచ్ఛగా జీవించే విధంగా రాజధాని ఉండాలి'' అని రాఘవులు పేర్కొన్నారు. మరిన్ని విషయాల కోసం వీడియో చూడండి.

Don't Miss