27మంది ప్రభుత్వ బ్యాంక్ అధికారులపై వేటు!.

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ నిబంధలను ఉల్లంఘించిన 27 మంది ప్రభుత్వ బ్యాంకుల అధికారులను ఆర్థిక శాఖ సస్పెండ్ చేసింది. మరో ఆరుగురు అధికారులను బదిలీ చేసింది. బ్యాంక్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ హెచ్చరిక జారీ చేసింది. కాగా పెద్దనోట్ల రద్దు అనంతరం ఆయా నోట్లను మార్పిడి చేసుకునేందుకు, చిన్న నోట్ల తీసుకునే నిమిత్తం బ్యాంకులకు వెళ్లిన ఖాతాదారులు పలు ఫిర్యాదులు చేస్తున్నారు. చిన్ననోట్లు ఇచ్చే విషయంలో బ్యాంకు అధికారులు సక్రమంగా వ్యవహరించడం లేదని, తమ సన్నిహితులకు, బడా బాబులకు దొడ్డిదోవన తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. 

Don't Miss