2019లో ఫాలో కావాల్సిన అంశాలు

Submitted on 1 January 2019
In 2019 the national and international features are organized

ఢిల్లీ : కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న శుభ సమయంలో నూతన సంవత్సరంలో జరగబోయే కొన్ని మెయిన్  ఇష్యూల గురించి తెలుసుకుందాం.. అంటే పాలిటిక్స్, స్పోర్డ్స్, ఎలక్షన్స్, గ్రహణాలు వంటి విశేషాల గురించి తెలుసుకుందాం.  
2019లో ఎన్నికలు..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన భారతదేశంలో 2019లో జరగనున్న ఎన్నికల్లో మరో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోనున్నారు. మార్చి నుంచి మే మధ్యలో లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. 


2019లో స్పోర్డ్స్..
ఇక ఎక్కువమంది ఎదురుచూసేది వరల్డ్ కప్ క్రికెట్ గురించే కదా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన 2019లో వరల్డ్ కప్ ఆడనుంది. భారత్ క్రికెట్ జగజ్జేత అవుతుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో 2019 ఐసీసీ వరల్డ్ కప్ లో 10 దేశాలు పాల్గొననున్నాయి.  మొత్తం 46 రోజుల పాటు ఈ వరల్డ్ కప్ వేడుక జరగనుండగా, 48 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ వేడుక క్రీడాభిమానులను అలరించనుంది. 


ఎకనమిక్ దేశాల చెంత భారత్..
అభివృద్ధి చెందుతున్న భారతదేశం 2018 సంవత్సరం 2.6 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదిగటమే కాక అతిపెద్ద ఎకానమిక్ దేశాల లిస్ట్ లో 9 నుంచి 6వ ప్లేస్ కు చేరుకోవటం సంతోషించదగిన విషయం. దీంతో 2019లో మరింతగా అభివృద్ధి చెందిన టాప్ 5కి చేరుకునేందుకు అవకాశాలు ఎక్కువగా వున్నట్లు ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


విదేశాలలో ఎన్నికలు..బాధ్యతలు..విశేషాలు..
ఇక ఇంటర్నేషనల్ అంశాలను పరిశీలిస్తే..2019 జనవరి 1 నుండి బ్రెజిల్ న్యూ ప్రెసిడెంట్ జైర్ బోల్సానోరో నాలుగేళ్ల పాలనలో భాగంగా నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు.  అలాగే ఫిబ్రవరి 16న ఆఫ్రికాలోతీ నైజీరియాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మరో విశేషం ఏమిటంటే  బ్రెగ్జిట్ ప్రక్రియ ఆలస్యం కాకుండా వుంటే మార్చి 29న యూరోపియన్ యూనియన్ నుంచి బ్రెజిల్ బైటకు రానుంది. ఏప్రిల్ 17న అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండొనేషియాలో బ్రెగ్జిట్ సమస్య ఓ కొలిక్కి వస్తే మేలో యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 28న జపాన్ తొలిసారిగా జీ-20 సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూలైలో ఆఫ్గనిస్థాన్ అధ్యక్ష పదవికి ఎన్నికలు..అక్టోబర్ 21న కెనడా ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు.  


2019లో ఐదు గ్రహణాలు విశేషాలు..
2019లో మొత్తం ఐదు గ్రహణాలు ఏర్పడనున్న క్రమంలో జనవరి 6న సూర్య గ్రహణం, జనవరి 20న సంపూర్ణ చంద్రగ్రహణం, జూలై 2న సంపూర్ణ సూర్య గ్రహణం, జూలై 16న పాక్షిక చంద్రగ్రహణం, డిసెంబర్ 26న సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనున్నాయి. 


20 సంవత్సరాల తరువాత బాధ్యతల నుండి జపాన్ రాజు విరమణ..
జపాన్ రాచరికంలో రాజు తనంతట తానుగా పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవడం రెండు శతాబ్దాల తరువాత తొలిసారిగా జరగనున్న క్రమంలో..జపాన్ రాజు అకిహితో ఏప్రిల్ 30న తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. రాజు మరణించిన తరువాతనే కొత్త వారసుడిని ప్రకటించే జపాన్ లో 1817లో చక్రవర్తి కొకారు తన బాధ్యతలను వీడిచిపెట్టగా..ప్రస్తుతం 85 సంవత్సరాల వయసున్న  వృద్ధాప్య కారణాల వల్లే అకిహితోఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అకిహితో కుమారుడు నారుహితోకు జపాన్ 126 చక్రవర్తిగా బాధ్యతలు అప్పగించనున్నారు.
 

india
Delhi
Japan
Lok Sabha
Elections
Prime Minister
Narendra Modi
Indonesia
Canada
Afonistan
Nigeria
Akihi

మరిన్ని వార్తలు