న్యూ ఇయర్ రోజు 100 మంది జైలుకి! 

Submitted on 1 January 2019
New year celerbations, Drunk and Drive cases, 100 youth may face jail  

ఎక్కడ చూసిన న్యూ ఇయర్ జోషే. డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలు ధూమ్ ధామ్ గా జరిగాయి. స్నేహితులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు. రాత్రంతా పబ్బుల్లో, బార్లల్లో పీకల్లోతు తాగి తెగ ఎంజాయ్ చేశారు. కట్ చేస్తే.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు పాపం. నోరు తెరిస్తే చాలు.. బ్రీత్ ఎనలైజర్ స్పీడ్ పెరిగిపోతోంది.. ఇంకేముంది పోలీసులు టేక్ ధెమ్ ఇన్ టూ కస్టడీ అనేశారు. తాగి డ్రైవ్ చేసిన వారందరిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు వంద మంది తనిఖీల్లో పట్టుబడ్డారు. కొత్త ఏడాది రోజునే ఇలా జైలుకు వెళ్లాల్సి వస్తుందని అనుకోలేదు. కొత్త సంవత్సరం రోజున ఇలా జరిగిందేమిటిరా బాబూ అంటూ తలలు పట్టేసుకున్నారు. ఇంటికి వెళ్లే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినవారి ధీనస్థితి ఇది..  

ఫుల్ గా తాగిన కిక్ ఇంకా దిగనేలేదు. కార్లు, బైక్ లు పోలీసులు సీజ్ చేశారు. ఒకవైపు రాత్రంతా పబ్బులకు, క్లబ్బులకు ఫుల్ గా లైసెన్స్ ఇచ్చేస్తారు.. అదే పబ్బుల్లో, బార్లలో తాగిన తమను మాత్రం ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకొని కేసులు పెడుతున్నారు. ఇదేమి న్యాయం అంటూ మందుబాబులు మండిపడుతున్నారు. తెల్లారితే జైలుకు వెళ్లాల్సిందేనా మదనపడుతున్నారు. న్యూ ఇయర్ హ్యాపీగా జరుపుకుందామనుకుంటే ఊసలు లెక్కించాల్సి వస్తుందని తెగ వర్రీ అవుతున్నారు.  కొత్త ఏడాది తియ్యని అనుభవాన్ని మిగులుస్తుందనకుంటే.. ఇలా చేదు అనుభవాన్ని మిగిల్చిందని బోరుమంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలు పబ్బులు, బార్లకు బారీ గిరాకీ ఉంటుందేమో.. తాగిన వారికి కాదు.. న్యూ ఇయరే కదా.. పోలీసులు ఏమంటారులే.. మహా అయితే కాసేపు ఉంచి వదిలేస్తారులే అనుకుంటే పొరపాటే. తస్మాత్ జాగ్రత్త.  

New year celerbations
Drunk and Drive cases
100 youth may face jail  

మరిన్ని వార్తలు