సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణస్వీకారం ..

p { margin-bottom: 0.25cm; line-height: 120%; }

తమిళనాడు : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం రాత్రి 11:30 గంటలకు కన్నుమూయడంతో అర్థరాత్రి 1:30 గంటలకు రాజ్‌భవన్‌లో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 15 మంది మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విద్యాసాగర్‌రావు వారిచే ప్రమాణస్వీకారం చేయించారు. జయలలిత మృతి పట్ల ప్రమాణ స్వీకారానికి ముందు శాసనసభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. తమిళనాడులో సీఎం మృతితో ఏడు రోజులు సంతాప దినంగా ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలకు, కార్యాలయాలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం అనంతరం పన్నీరు సెల్వం కన్నీటి పర్యంతమయ్యారు.

Don't Miss