సింధుకు రజతం...

20:35 - August 28, 2018

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి ఫైనల్‌ను అధిగమించలేకపోయింది. ఆసియా క్రీడల్లో సింధు రజతంతోనే సరిపెట్టుకుంది. ఫైనల్లో సింధు ప్రపంచ నంబర్‌వన్‌ క్రీడాకారిణి తై జు యింగ్‌ చేతిలో రెండు వరుస సెట్లలో ఓడి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఫైనల్స్‌లో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆట ప్రారంభం నుంచి వెనుకంజలోనే ఉంది. తొలిసెట్‌ను 13-21తో కోల్పోయిన సింధు.. రెండో గేమ్‌ను 16-21తో ఓడిపోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. దీంతో సింధు రజతంతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ 13 సార్లు తలపడగా 10సార్లు తైజూనే పైచేయిగా నిలిచింది. 

Don't Miss