విశ్రమించిన విప్లవ' నాయకి'...

09:50 - December 6, 2016

తమిళనాడు : ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రిగా..సినీ వినీలాకాశంలో ధృవతారగా..తమిళ రాజకీయాల్లో ధీశాలిగాగా..అవమాలను..ఆటుపోటులను తట్టుకుని మేరుపర్వతంలా నిలిచి.. ప్రత్యర్థి పార్టీని ముప్పుతిప్పలు పెట్టి..ప్రజల గుండెల్లో 'అమ్మ'గా శాస్వతంగా నిలిచిపోయిన తమిళనాడు సీఎం జయలలిత కన్నుమూశారు. ఆమె ఈ రాత్రి గం 11.30 లకు కన్నుమూసినట్టు అపోలో ఆసుపత్రి యాజమాన్యం తన ప్రెస్ నోట్ ద్వారా ధృవీకరించింది. ఆదివారం రాత్రి గుండెపోటుకు గురైన ఆమెను మళ్లీ ఐసీయూకు తరలించి స్వదేశీ, విదేశీ వైద్యులతో చికిత్సను కొనసాగించినా ఫలితంగా లేకుండాపోయింది. ధైర్యానికి..ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా మహిళా లోకంలో మణికిరీటం నేలరాలిపోయింది. దీంతో తమిళనాడు గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. సందర్శనార్థం జయలలిత పార్థివ దేహాన్ని అపోలో ఆస్పత్రి నుంచి ఆమె నివాసమైన పోయెస్‌గార్డెన్‌కు తరలించారు. జయలలిత మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అభిమానుల శోకానికి అంతులేకుండాపోయింది. ఈ అంశంపై టెన్ టీవీ చర్చను నిర్వహించింది. ఈ చర్చలో నగేష్ కుమార్ (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు), నడిపంపల్లి సీతారామరాజు (విశ్లేషకులు),కుమార్ (బీజేపీ నేత),శర్మ (ఏపీ సీసీ లీగల్ సెల్ కన్వీనర్) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వారి అభిప్రాయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

Don't Miss