వరవరరావుపై UAPA యాక్ట్...

19:20 - August 28, 2018

హైదరాబాద్ : విరసం నేత వరవరరావు అరెస్టు చేయడం నగరంలో కలకలం రేగింది. 2015 సంవతస్రంలో మారఓయిస్టు రోనాల్డ్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధాన మంత్రి మోడీ హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు ఉన్న లేఖను పోలీసులు కనుగొన్నారు. దీనికి సంబంధించిన ఫండింగ్ విరసం నేత వరవరరావు అందిస్తారని లేఖలో గుర్తించారని తెలుస్తోంది. అందులో భాగంగా మూడు నెలల అనంతరం పూణే పోలీసులు నగరానికి చేరుకుని వరవరరావు నివాసం..ఆయన కూతుళ్ల నివాసాలపై పోలీసులు సోదాలు నిర్వహించారు. సుమారు 8గంటల పాటు సోదాలు చేసిన అనంతరం కంప్యూటర్, ఇతరత్రా పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

అనంతరం ఆయన్ను అరెస్టు చేసి గాంధీ ఆసుపత్రికి వైద్య చికిత్సలు చేసిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఆయనపై యూఏపీఏ కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు చట్ట వ్యతిరేక కార్యాకలాపాల (నిరోధక చట్టం) (యూఏపీఏ) యాక్ట్ దేశంలో కేవలం ఐదుగురిపై మాత్రమే నమోదు చేశారు. ఈ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 15, 16, 17 కింద కేసు నిరూపితం అయితే టెర్రరిస్ట్‌గా భావించి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతెసే విధంగా, దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పనిచేసే గ్రూపులను అణచివేయడానికి ఈ చట్టం తీసుకొచ్చారు. 

Don't Miss