రైల్వే జోన్ సురేష్ ప్రభు పరిధిలో లేదు - సుజనా..

ఢిల్లీ : రైల్వే మంత్రి సురేష్ ప్రభు, రైల్వే బోర్డు అధికారులతో ఏపీ టిడిపి నేతలు సమావేశమయ్యారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, అమరావతికి రైల్వే అనుసంధానం, వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో రైల్వే మార్గాలపై చర్చించడం జరిగిందని కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. రైల్వే జోన్ అంశం సురేష్ ప్రభు పరిధిలో లేదని, రైల్వే జోన్ పై కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని పేర్కొనడం జరిగిందన్నారు. పార్లమెంట్ సమావేశాలకు, రైల్వే జోన్ కు సంబంధం లేదన్నారు. హావ్ లాక్ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా మార్చే అంశంపైనా చర్చ జరిగిందని, ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులపై పది రోజుల్లో నివేదిక ఇస్తామని రైల్వే మంత్రి చెప్పారని పేర్కొన్నారు. 

Don't Miss