మోడీ రాకపోవడం వల్లే సభలో ప్రతిష్టంభన - ఏచూరి..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభకు రాకపోవడం వల్లే పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని సీపీఎం రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ప్రధాని సభకు రాకుండా తప్పించుకుంటున్నారని, మొదట నల్లధనం కోసం నోట్ల రద్దు అని పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలని మాట మారుస్తున్నారని, 82 శాతం నగదు బ్యాంకులకు చేరిందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు. అంటే నల్లధనం మార్పిడి జరిగిందని తెలుస్తోందని నోట్ల మార్పిడిలో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ సమావేశాలు జరుగుతుండగానే సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.

 

Don't Miss