మురదాబాద్ లో మోడీ ఎన్నికల ప్రచారం..

ఉత్తర్ ప్రదేశ్ : మురాదాబాద్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. తనకు హైకమాండ్ లేదని, ప్రజలే తనకు హై కమాండ్ అని తెలిపారు. జన్ ధన్ ఖాతాల్లో డబ్బులు వేసిన వాళ్లు మళ్లీ అడిగితే ఆధారాలు చూపమని నిలదీయాలని, పేదల ఖాతాల్లో వేసిన డబ్బులు వారికే చెందుతాయన్నారు. నల్లధనం దాచుకున్న వారు తనను ఏమీ చేయలేరని, ఎన్నికల్లో తనను ఓడిస్తే బ్యాగు సర్దుకుని వెళ్లిపోతానని ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. నిజాయితీ పరులంతా బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిలుచుంటే అవినీతిపరులంతా ఇళ్లలో ఉన్నారన్నారు. కొద్దిరోజులు ఓపికపడితే క్యూలో నిలబడే అవసరం ఉండదని, ఆన్ లైన్ లావాదేవీలతో నమ్మకమైన సేవలందుతాయని చెప్పుకొచ్చారు.

Don't Miss