భారత్ తో సంబంధాలు పటిష్టం - అప్ఘన్ అధ్యక్షుడు..

పంజాబ్ : భారత్ తో అప్ఘన్ సంబంధాలు పటిష్టంగా ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ వ్యాఖ్యానించారు. అమృత్ సర్ లో హార్ట్ ఆఫ్ ఏషియా సమ్మిట్ ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశ ప్రధాని మోడీ, అప్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పాల్గొన్నారు. వీరితో పాటు 40దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉగ్రవాదం, అభివృద్ధి, భద్రత, వాణిజ్యంపై చర్చించారు. ఉగ్రవాదంపై పోరు లక్ష్యంగా సదస్సుకు అతిథ్యమిచ్చిన భారత్ కు ఘనీ కృతజ్ఞతలు తెలియచేశారు. ఉగ్రవాదం నుండి అప్ఘన్ ముప్పు ఎదుర్కోంటోందని, ఎలాంటి షరతులు లేకుండానే భారత్ తమకు సహాయం చేస్తోందని తెలిపారు. సంస్కరణలే లక్ష్యంగా ఇరుదేశాలు ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.

Don't Miss