బాబు అధ్యక్షతన సీఎంల కమిటీ సమావేశం..

ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ముఖ్యమంత్రుల కమిటీ సమావేశం కానుంది. ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఈ కమిటీ తొలి భేటీ జరగనుంది. కరెన్సీ లావాదేవీలను నివారించి, నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ చర్చించనుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నెలకొన్న ఇబ్బందులను కూడా ఈ కమిటీ చర్చిస్తుంది. కాగా నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఏపీ సీఎం అధ్యక్షతలన 5రాష్ట్రాల సీఎంలతో కూడిన ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు అనంతరం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో నోట్ల రద్దుపై కష్టాలు తక్కువ శాతంలో వుండటం..దానికి సీఎం చంద్రబాబు విధానాలేకారణమని గమనించిన కేంద్రం చంద్రబాబును ఈ కమిటీకి కన్వీనర్ గా నియమించింది. 

Don't Miss