'బాంబు'లేసిన కోతులు..జనాలకు గాయాలు..

11:24 - July 21, 2018

ఉత్తరప్రదేశ్ :  బాంబులు వేసుకోవటం..ఆయుధాలతో దాడిచేసుకోవటం..ఒకరిపై ఒకరు ఆరోపించుకోవటం..ఆగ్రహించుకోవటం అనేది మనిషుల్లో వుండే లక్షణాలు.కానీ జంతువులు వాటి వాటి ధర్మాలను అనుసరిస్తు సమూహాలుగా నివసిస్తుంటాయి. వాటి వాటి నియమనిబంధనలను ఉల్లంఘించవు. వాటి జీవనం కోసం..ఆహారం కోసం పోరాడటమే తప్ప ఒక జంతువుపై మరో జంతువులు దాడికి దిగదు. జంతువుల్లో కోతులనుతీసుకుంటే మనుషులకు కోతులకు చాలా దగ్గరి సంబంధాలుంటాయి. కానీ అవి మనుషుల మాదిరిగా అరాచకాలకు పాల్పడవు..మనుషులకు అతి దగ్గరగా వుండే జంతువుల్లో కోతులు కూడా ఒకటి. కుక్క, పిల్లి వలెనే కోతులు కూడా మనుషులుకు దగ్గరగా వుంటాయి. ఇంకా చెప్పాలంటే కోతులు మనుషులకు జీవనాధారంగా కూడా ఉపయోగపడుతుంటాయి. కోతులను ఆడించి జీవనం కొనసాగించేవారిని మనం తరచు చూస్తుంటాం కదా!..సర్కస్ ల్లోను, గారడీ చేసేవారి వద్ద ఇలా కోతులు మనుషులకు దగ్గరగా వుండటమే కాక వారికి జీవనాధారంగా కూడా ఉపయోగపడుతుంటాయి. వాటి సహజ లక్షణమైన చిలిపితనంతోను..అల్లరి చేష్టలతోను మనుషులను అలరిస్తుంటాయి. కానీ అరాచకాలకు మాత్రం పాల్పడవు. కానీ ఓ విచిత్ర పరిస్థితుల్లో కోతులు మనుషులపై బాంబులు వేసి సందర్భాన్ని మనం ఊహించగలమా? కానీ జరిగింది. నిజమండీ..ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
తాతా మనవళ్లపై బాంబులేసిన కోతులు..
అవును! కోతి బాంబులు విసరడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ గ్రామానికి చెందిన గులాబ్ గుప్తా అనే 60 ఏళ్ల వ్యక్తి తన మనవడుని స్కూలు నుండి తీసుకువచ్చేందుకు వచ్చే సయమం కావటంతో ఐదేళ్ల తన మరో మనవడితో కలిసి ఇంటి బయట ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలోనే అటుగా వెళ్తున్న కోతులు వేసిన నోట కరచుకున్న ఓ సంచిని తాతా మనుమడు నిల్చున్న ప్రాంతంలో జార విడిచాయి. అంతే!! పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో తాతామనవళ్లు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

పాలిథిన్ కవర్ లో బాంబులు..
దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పరిశీలించారు. బహుశా కోతులు బహుశా చెత్త డంపింగ్ యార్డ్ నుంచి ఆ సంచిని తీసుకొచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సంచితో ఇంటిపైన ఆడుకుంటుండగా నోటితో పట్టుకున్న పాలిథిన్ కవర్ పొరపాటున కిందపడి పేలుడు సంభవించి ఉండొచ్చని పేర్కొన్నారు. బాధితులకు ప్రాణాపాయం లేదని, కోలుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుందని పోలీసులు తెలిపారు. 

Don't Miss