బంజారాహిల్స్‌ గోల్డ్‌ షాపులపై ఐటీ దాడులు..

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరులు తమ డబ్బుని బంగారం రూపంలోకి మార్చుకొని నిల్వ చేసుకునేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీగా బంగారం కొనుగోళ్లు చేసిన వ్యక్తులపై ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు నిఘా ఉంచారు.ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని గోల్డ్‌ షాపులపై ఐటీ దాడులు జరిగాయి. నవంబర్‌ 8, 9 తేదీల్లో పాతనోట్లతో రూ.100 కోట్లకు పైగా బంగారం అమ్మకాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ కేసును ఐటీ అధికారులు ఈడీకి అప్పగించారు. 

Don't Miss