పోలవరానికి మార్పులు కుదరవు: సంజీవ్ కుమార్

ఢిల్లీ : కేంద్ర నీటి వనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ పేర్కొన్నారు. పోలవరం నిర్మాణం విషయంలో ఎటువంటి మార్పులు కుదరవని తేల్చి చెప్పారు. లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీ సీతారామ్ నాయక్ మాట్లాడుతూ..కేంద్రం ఆధ్వర్యంలో ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని కోరారు. జాతీయ స్థాయిలో నిర్మించే ఈ ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం ముంపుకు గురవుతుందనీ..పేరు ప్రఖ్యాతులు కలిగిన భద్రాద్రి రామన్న ఆలయం మునిగిపోతుందన్నారు. లక్షలాదిమంది ఆదివాసీలు నిర్వాశితులుగా మారిపోతారనీ ఈ విషయంలో తమ అభ్యంతరాలను పరిణలోకి తీసుకోవాలని సీతారాంనాయక్ కోరారు. ఈ ప్రాజెక్టును సరైన అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారని ఆరోపించారు. గ్రీన్ ట్రైబ్యునల్ నుంచి కూడా ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలిపారు. పోలవరం ఎత్తును తగ్గించకపోతే ఆధ్యాత్మిక క్షేత్రం భద్రాచలం మునిగిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Don't Miss