తమిళ కేబినెట్ అత్యవసర భేటీ..

తమిళనాడు : మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం విదితమే. గుండెపోటు వచ్చిన జయకు అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, అమ్మ ఆరోగ్యం పరిస్థితిపై మంత్రివర్గం సమీక్షిస్తోంది. ఇప్పటికే రాష్ట్రమంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. తమిళనాడులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమ్మ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ప్రకటన కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Don't Miss