టీ షాప్ నుండి సీఎం వరకూ..

తమిళనాడు : పన్నీర్‌సెల్వం దక్షిణాది తమిళనాడులో బలమైన థేవార్స్ - మారవార్ సామాజిక వర్గానికి చెందిన వారు. థేనీజిల్లాలోని పెరియాకులంలో 1970వ దశకంలో స్నేహితుడు విజయన్‌తో కలిసి రోజీ క్యాంటిన్ పేరిట టీ షాప్ ప్రారంభించారు. దీన్ని పీవీ క్యాంటిన్ అని కూడా పిలిచేవారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎంజీఆర్‌కు సెల్వం వీరాభిమాని. ఈయన ఆధ్వర్యంలోనే సెల్వం రాజకీయాల్లోకి వచ్చారు. ఎంజీఆర్ మృతి అనంతరం చీలిపోయిన అన్నాడీఎంకేలో తొలుత జానకీ రామచంద్రన్‌కు మద్దతు పలికారు. తర్వాత జయకు మద్దతు పలికారు పన్నీర్ సెల్వం..మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ తమిళనాడు నుంచి 10 స్థానాలకు అన్నాడీఎంకే విజయంలోనూ సెల్వందే కీలక పాత్ర. అనతంరం ఆయన అంచెలంచెలుగా ఎదిగిన ఆయన జయలలిత మృతికి ముందు తరువాత కూడా సీఎం అయ్యారు.

Don't Miss