టీఆర్ఎస్ సర్కార్ మాయ చేస్తోంది - తమ్మినేని..

కామారెడ్డి : బీబీపేటకు సీపీఎం మహాజన పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బృంద రథసారధి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మాయ చేస్తోందని, టిడిపి, కాంగ్రెస్ పార్టీలు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు కార్మికుల తరపున సీపీఎం పోరాడుతుందన్నారు. మోడీకి పెట్టుబడిదారులు, కేసీఆర్ కు కాంట్రాక్టర్లు..ఫార్మాసిస్ట్ కంపెనీలు కావాలన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, బీడీ కార్మికులకు ఫించన్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. సీపీఎం పార్టీకి మాట తప్పే చరిత్ర లేదని, సమస్యల సాధనకు ప్రాణాలైనా అర్పిస్తామన్నారు. 

Don't Miss