'జయ పోరాటయోధురాలే కాదు మానవత్వం ఉన్న మనిషి'

అమరావతి : జయలలిత మృతికి సంతాపంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం బాబు మాట్లాడుతూ కొందరు నాయకులు మాత్రమే ప్రజల గుండెల్లో ఉంటారని... అందులో జయలలిత ముందుంటారని పేర్కొన్నారు. జయ పోరాటయోధురాలే కాదు మానవత్వం ఉన్న మనిషి అని కొనియాడారు. తెలగు గంగ విషయంలో చాలా సహకరించారని, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేశారని తెలిపారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు చెప్పారు. తాను కూడా త‌మిళ‌నాడుకు వెళుతున్నానని, జ‌య‌ల‌లిత‌కు క‌డ‌సారి వీడ్కోలు ప‌లుకుతాన‌ని,ఆవిడ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నానని అన్నారు.

Don't Miss