జయ అంత్యక్రియలకు ఏర్పాట్లు

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు మెరీనా బీచ్‌‌ దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు. ‘అమ్మ’ రాజకీయ గురువు ఎంజీఆర్ సమాధికి ఎదురుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరిగ్గా ఎంజీఆర్ సమాధికి కూతవేటు దూరంగా అమ్మకు సమాధి తవ్వుతున్నారు. మెరీనా బీచ్‌‌ తమిళనాడు ప్రజలకు చాలా ఫేమస్. ప్రస్తుతం జయ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీహాల్‌‌లో ఉంచారు. అక్కడ్నుంచి అంతిమ యాత్రగా మెరీనాబీచ్‌ తీసుకొస్తారు. రాజాజీహాల్ నుంచి బీచ్‌‌కు ఒకటిన్నర కి.మీ దూరం ఉంటుంది.కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జయలలిత అంత్యక్రియలు సాయంత్రం 4.30 గంటలకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తరుపు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పాన్ రాధాకృష్ణన్ పర్యవేక్షిస్తున్నారు.

Don't Miss