చెన్నైలోని అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..

తమిళనాడు : చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో రెండు నెలలకు పైగా చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలిసిన పలు పార్టీల నేతలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇక వేలాదిమంది ‘అమ్మ’ అభిమానులు ఆస్పత్రికి చేరుకుని రాత్రంతా ఆస్పత్రి ఎదుట జాగారం చేశారు. అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆస్పత్రికి తరలిరావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జయలలిత కోలుకుంటున్నారని, త్వరలో బయటకు వస్తారని ఇప్పటి వరకు ప్రకటిస్తూ వచ్చిన వైద్యులు, అన్నాడీఎంకే నేతలు ఇప్పటికైనా ఆమె ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆస్పత్రి పరిసరాలు ఉద్రికత్తంగా మారాయి.

Don't Miss