చంద్రబాబునాయుడు పాత్రలో ఒదిగిపోయిన రానా

17:36 - September 12, 2018

హైదరాబాద్: ఎన్టీఆర్ బయోపిక్ సినిమా యూనిట్ చిత్రానికి సంబంధించి మరో పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో నారా చంద్రబాబునాయిడు పాత్రలో రానా దగ్గుబాటి ఉన్న పోస్టర్ ను రానా తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. చంద్రబాబు వయసులో ఉండగా ఎలా ఉండేవారో దానికి దగ్గరిగా రానాను తీర్చిదిద్దారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి వహిస్తుండగా.. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్నారు. ఎస్వీ రంగారావు పాత్రలో నాగబాబు నటిస్తున్నట్టు సమాచారం. అలాగే విద్యాబాలన్ బసవతారం పాత్రలో, సుమంత్ ఏఎన్నార్ పాత్రలో, ప్రకాష్ రాజ్ నాగిరెడ్డి పాత్రలో కనిపించబోతున్నారు.

Don't Miss