కేసీఆర్ కు తమ్మినేని 43వ లేఖ..

నిజామాబాద్ : సీఎం కేసీఆర్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, మహాజన పాదయాత్ర బృంద రథసారధి తమ్మినేని వీరభద్రం మరో లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో సీపీఎం పాదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బడుగు, బలహీన వర్గాల బాలికలను జోగినీలుగా మార్చే దుష్ట సంప్రదాయ ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతోందని 43వ లేఖలో పేర్కొన్నారు. పెన్షన్ కోసం భర్త చనిపోయినట్లు సర్టిఫికేట్ కావాలంటున్నారని, ఫీజు రీయింబర్స్ మెంట్ అందక పిల్లలు ఉన్నత విద్యకు దూరమౌతున్నారని పేర్కొన్నారు. దళితులకు అందే ప్రయోజనాలు ఒక్కటి అందడం లేదని వారు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. జస్టిస్ రఘునాథరావు కమిషన్ సిఫార్సులను అమలు చేసి జోగినీలకు పునరావాసం, సంక్షేమ పథకాలను అందించాలన్నారు. వికలాంగులకు పెన్షన్, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. వంద సబ్సిడీతో ఎస్సీ కార్పొరేషన్ రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. 

Don't Miss