కేసీఆర్ కు తమ్మినేని 42వ లేఖ..

కామారెడ్డి : సీఎం కేసీఆర్ కు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరో లేఖ రాశారు. ఇది 42వ లేఖ. కామారెడ్డి జిల్లా గాంధారి (మం) నర్సాపురం గ్రామం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. నర్సాపురం నుండి సమీప ప్రాంతాలకు అటవీ ప్రాంతం గుండా వెళ్లే క్రమంలో గ్రామస్తులపై జంతువులు దాడి చేస్తున్నాయని తెలిపారు. ఇటీవలే ఓ గర్భవతి మార్గమధ్యంలోనే ప్రసవించిందని, ఐదో తరగతితోనే విద్యార్థులు చదువుకు స్వస్తి పలుకుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రోడ్డు వేయాలని ఆందోళన చేసిన గ్రామస్తులను స్థానిక ఎమ్మెల్యే పోలీసులతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే తన వ్యవసాయ క్షేత్రానికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యం కల్పించుకున్నారని తెలిపారు. ముద్దెల్లి నుండి కొయ్యగుట్టలను కలుపుతూ రోడ్డు నిర్మించాలని, కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.

Don't Miss