కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్గించాలి : రేవంత్

కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలిగించి సామాజిక తెలంగాణ ఏర్పాటు చేసే బాధ్యత ఉందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. టెన్ టివి నిర్వహించిన వన్ టు వన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఇప్పుడున్న షార్టు ఫామ్ టీఎస్ ను తీసేసి.. టీజీ అని పెడ్తామని చెప్పారు. ప్రభుత్వ చిహ్నాలుగా ఇప్పుడు చిహ్నాలు చార్మినార్, కాకతీయ కోట ఉన్నవి.. అవి రాజరికపు అనవాలు..  వాటి స్థానంలో అమరుల వీరుల స్థూపాన్ని తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
మా తల్లి తెలుగుతల్లి
'తెలంగాణ తల్లితో మాకు సంబంధం లేదు'. తెలంగాణ తల్లి..సీఎం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే సంబంధం. 'తెలుగు తల్లి మాకు తల్లి'. తెలంగాణ కళాకారులందరూ కేసీఆర్ అనుచరులు. తెలంగాణ కళాకారులని వారికి పెద్ద సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు'. 
టీడీపీ తెలంగాణలో పుట్టింది.. 
'టీడీపీ తెలంగాణలో పుట్టింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో పుట్టిన పార్టీ ఆంధ్రలో అధికారంలో ఉంది.. కానీ ఆంధ్రలో పుట్టిన పార్టీ తెలంగాణలో అధికారంలో లేదు. టీడీపీ ఎపి పార్టీ కాదు. నాపై ఎంత ఒత్తిడి పెరిగితే నా బ్రెయిన్ అంత షార్ప్ గా పని చేస్తుంది. ప్రజల వైపు ఉంటాం... వారి సమస్యలపై పోరాడుతామని' చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss