ఏపీ ప్రత్యేక హోదా వచ్చే అవకాశం వుందా?.

ఏపీ విభజన నేపథ్యంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాలమధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మిన్నంటున్నాతున్నాయి. ఈక్రమంలో గత నాలుగేళ్ల నుండి కేంద్రంతో ప్రత్యేక హోదా కోసం పోరాడుతునే వుంది. అధికారపక్షం అయిన టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను అశించి కేంద్రంతో పొత్తుపెట్టుకుంది. కానీ కేంద్రం ఇచ్చిన హామీల విషయంలో నిర్లక్ష్యం వహించటం..ఎన్నిమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవటంతో కేంద్రం కేబినెట్ నుండి టీడీపీ వైదొలగింది. ఇటు రాష్ట్ర కేబినెట్ నుండి బీజేపీ వైదొలగింది. ఈ క్రమంలో కేంద్రంతో విసిగిపోయిన టీడీపీతో పాటు వైసీపీ వంటి పలు పార్టీలు పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయినాగానీ తన వైఖరిని వీడన కేంద్రప్రభుత్వం అవిశ్వాసన తీర్మానంపై కనీస చర్చకూడా చేపట్టకుండా రాజకీయకుతంత్రంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో అసలు ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? అసలు అటువంటి అవకాశం వుందా? ఈక్రమంలో ప్రధానిగా నరేంద్రమోదీ వున్నంత కాలం ఏపీకి ఎటువంటి ప్రయోజం వుండదనీ..ప్రత్యేక హోదా రాదని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ప్రభుత్వంపైవచ్చిన నిరసనలతో ఉత్సాహంగా వున్న కాంగ్రెస్ తాను తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేస్తోంది. అంతేకాదు రాష్ట్ర విభజన నేపథ్యంలో తాము ఇచ్చిన అన్ని హామీలను అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామంటున్నా ఏపీ పీసీసీ అధ్యక్షులు నీలకంఠం రఘువీరా రెడ్డితో సతీష్ ఫేస్ టు ఫేస్..

Don't Miss