అమ్మ కోలుకోవాలని పలువురి ఆకాంక్ష..

తమిళనాడు : సీఎం జయలలిత మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఐసీయూ నుండి వార్డుకుతరలించిన ఆమెకు ఆదివారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను ఐరసీయూకు తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా ఆమె ఆరోగ్యం తీవ్ర విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఆమె కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నట్లుగా తెలుపుతున్నారు. ప్రధాని మోదీ..రాష్ట్రపతి ప్రణబ్..మాజీ సీఎం కరుణానిధి ఆమె కోలుకోవాలని ట్వీట్ చేశారు. మరో పక్క కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆమె ఆరోగ్యంపై తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ..ఇంకా పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపుఆసుపత్రి వద్ద భారీగా పోలీసలు మోహరించాయి. ఆసుపత్రివద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ఏ క్షణంలో ఏవార్త వినాల్సివస్తుందోనని అభిమానులు తీవ్ర ఆందోళనలకు లోనవుతున్నారు. దీంతో రాష్ట్రమంతటా పోలీసులు దిగ్భంధంలో తమిళనాడు వుంది.

Don't Miss