అధికారపక్షంపై ఆజాద్ తీవ్ర ఆగ్రహం..

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం వంద మంది రైతులు..వృద్ధులు..ఇతరులు మృతి చెందారని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. ఉదయం సభ ప్రారంభం కాగానే అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. క్యూ లో నిలబడి మృతి చెందిన వారికి సంతాపం తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, ఈ రోజు గాంధీ విగ్రహం వద్ద విపక్షాల బ్లాక్ డే నిర్వహించాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు చాల సమస్యలు ఎదుర్కొంటున్నారని సభకు తెలిపారు. వివాహాలు చేసుకోకుండా..రైతులు పంటలు పండించుకోకుండా చాలా అవస్థలు పడుతున్నారని విమర్శించారు. సిగ్గు లేని చర్య అంటూ స్వపక్షంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 

Don't Miss