సారూ విన్నారా : రాహుల్ యోగా చేస్తే.. కాంగ్రెస్ గెలిచేది

Submitted on 19 June 2019
Congress lost Lok Sabha elections because Rahul Gandhi does not do yoga

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణం ఏంటో తెలుసా.. మీకు, నాకు తెలియకపోవచ్చు.. కానీ.. యోగా గురు రాందేవ్ బాబాకి మాత్రం తెలుసట. కాంగ్రెస్ ఓటమికి కారణం ఏంటో బాబా గారు సెలవిచ్చారు. కాంగ్రెస్ ఛీప్ రాహుల్ గాంధీ యోగా చెయ్యకపోవడమే.. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి కారణం అన్నారు రాందేవ్ బాబా. రాహుల్ గాంధీ ఏనాడు కూడా యోగా ప్రాక్టీస్ చేయలేదన్నారు. అంతర్జాతీయ యోగా డే కి ఒక రోజు ముందు రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీని విమర్శించిన రాందేవ్ బాబా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. ''ప్రధాని మోడీ బాగా యోగా చేస్తారు. ప్రధాని మోడీ జనం మధ్యలో యోగా చేస్తారు. నెహ్రూ, ఇందిరా గాంధీ దాక్కొన్ని యోగా చేశారు. వారి వారసులు మాత్రం యోగా చెయ్యలేదు. అందుకే వారి రాజకీయ జీవితం అయోమయంగా ఉంది. యోగా చేసే వారికి మంచి రోజులు వస్తాయి'' అని రాందేవ్ బాబా అన్నారు.

రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. బాబా మాటల పట్ల కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. బాబాలకు రాజకీయాలతో ఏం పని అని మండిపడుతున్నారు. యోగాని ప్రమోట్ చేసుకోవడంలో తప్పు లేదు.. కానీ ఇలా.. ఓ పార్టీ చీఫ్ ని కించపరచడం కరెక్ట్ కాదన్నారు. ప్రధాని మోడీని ప్రశంసించడం ఏంటని నిలదీస్తున్నారు.

Congress
lost
Lok Sabha Elections
Rahul gandhi
Yoga
Baba Ramdev

మరిన్ని వార్తలు