సర్ఫ్‌ఎక్సెల్‌తో ఎమ్‌ఎస్‌ ఎక్సెల్‌కు తిప్పలు

Submitted on 13 March 2019
Confused Users Drop Hate Reviews on Ms Excel App on Play store

అదేంటి? బట్టలు ఉతికే సర్ఫును తయారు చేసే కంపెనీతో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీకి చెందిన ఎమ్‌ఎస్‌ ఎక్సెల్‌కు వచ్చిన తిప్పలు ఏంటి? అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే.. హోలీ నేపథ్యంలో ఓ యాడ్‌ని తీసిన సర్ఫెక్సల్ డిటర్జెంట్ మరక మంచిదే అంటూ చివరలో పేర్కొంది. అయితే ఈ యాడ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని హిందూ సంస్థలు #BANSurf Excel అంటూ ట్రెండ్‌ను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంతవరకూ క్లారిటీ ఉన్నా అసలు సమస్య ఇక్కడే వచ్చింది. 
Read Also : రూ.2వేల నోటు కోసం ప్రాణాలతో చెలగాటం

సర్ఫ్ ఎక్సెల్‌, ఎమ్‌ఎస్‌ ఎక్సెల్‌ పేర్లు రెండూ ఒకేరకంగా ఉండడంతో కొందరు నెటిజన్లు.. గూగుల్ ప్లే స్టోర్‌లోని ఎమ్ఎస్ ఎక్సెల్ మొబైల్ వెర్షన్‌పై తక్కువ రేటింగ్ ఇవ్వడంతో పాటు బాయ్‌కాట్ చేస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు. రివ్వ్యూ విభాగంలో ఎంఎస్ ఎక్సెల్‌కు తక్కువ రేటింగ్ ఇస్తూ సర్ఫ్‌ఎక్సెల్‌ను బాయ్‌కట్ చేస్తున్నట్లు కామెంట్లు పెడతున్నారు. సర్ఫ్‌ఎక్సెల్‌ గో బ్యాక్ అంటూ రాస్తూ.. ఎమ్‌ఎస్ ఎక్సెల్‌కు వన్ స్టార్ రేటింగ్ ఇస్తున్నారు.
Read Also : SurfExcelను బ్యాన్ చేయాలా? ఎందుకు?

SurfExcel
Microsoft Excel
Play store
Negative  Rating
Hate Reviews

మరిన్ని వార్తలు