ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : వారానికి 4 రోజులే పని!

Submitted on 25 May 2019
A Company Switches To Four-Day Work Week & Gives Staff A Raise. Hello, Boss are you Reading This?

వారానికి ఆరు రోజులు డ్యూటీ.. ఒకరోజు వీకాఫ్.. మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లాలంటే ఎంతో బోరుగా ఫీల్ అవుతారు. వారం అంతా ఆఫీసుల్లో పనిచేయడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతారు. వారంలో ఒకరోజు వీకాఫ్ తీసుకున్నప్పటికీ.. ఆ రోజుంతా రెస్ట్ తీసుకోవడానికే సరిపోదు. దీంతో మానసిక ఒత్తిడికి గురవుతుంటారు.

కొన్ని కంపెనీల్లో అయితే.. వారానికి ఐదురోజులే పని.. రెండు రోజులు వీకాఫ్ ఉంటుంది. తమ కంపెనీలో కూడా వారంలో రెండు లేదా మూడు రోజులు వీకాఫ్ ఉంటే ఎంతో బాగుండు అని చాలామంది ఉద్యోగులు అనుకుంటారు. అలా భావించే ఉద్యోగులకు వారి కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇకపై వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని ప్రకటించింది.

అంతే.. ఆ కంపెనీ ఉద్యోగుల్లో పట్టరాని ఆనందం.. ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా పనిచేసుకుంటున్నారు. ఇంతకీ ఎక్కడో తెలుసా? లండన్ లోని పాలీమౌత్, పోర్ట్ క్యూల్లీస్ లీగల్స్ అనే ప్రైవేటు కంపెనీలో. ఈ కంపెనీ బాస్.. తమ ఉద్యోగులను.. వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయండి.. ఎలాంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా వర్క్ చేసుకోండని చెప్పాడు. నాలుగు రోజుల పనివిధానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ఈ కంపెనీ.. ఐదు నెలల పాటు ఇదే షెడ్యూల్ ఫాలో అయింది. ఆ తర్వాత 4 రోజుల వర్కింగ్ పాలసీని పర్మినెంట్ గా అమల్లోకి తీసుకొచ్చారు.

ఈ కొత్త విధానంపై సంస్థ ఉద్యోగి మాట్లాడుతూ.. నాలుగు రోజుల పని విధానంతో ఉద్యోగులంతా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని, ఎలాంటి పని ఒత్తిడి ఉన్నట్టుగా అనిపించడమే లేదని సంతోషం వ్యక్తం చేశాడు. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తేనే.. సంస్థ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మీ కంపెనీలో కూడా ఇలానే నాలుగు రోజులు పనిదినాలు ఉండి.. మూడు రోజులు వీకాఫ్ ఉండాలని భావిస్తున్నారా? అయితే మీ బాస్ తో కూడా ఈ వార్త చదివించండి.. 

Four-Day Work Week
UK company
UK Staff
Boss
employees
Stress
Week off
London company

మరిన్ని వార్తలు