ట్రాఫిక్ వసూళ్లు: పోలీసులను ప్రశ్నించిన సామాన్యుడు.. వైరల్ అయిన వీడియో

Submitted on 17 September 2019
Common Man Questions Police in Khammam

ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రాఫిక్ వసూళ్ల విషయంలో చర్చ విపరీతంగా జరుగుతుంది. పోలీసులు కూడా నిబంధనలు పాటించట్లేదంటూ భారీగా వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఖమ్మంలో కూడా కొందరు పోలీసు కానిస్టేబుళ్లు వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. ఎస్సై, సీఐ లేకుండా దారిన వెళ్లే వాహనదారులను ఆపి కాగితాలు చూపించాలని అడుగుతూ ఫైన్ లు విధించారు.

వాళ్లు ట్రాఫిక్ పోలీసు చొక్కాలు వేసుకోకపోవడం, కనీసం ఎస్సై లేకుండా కాగితాలు అడగడంతో ఓ సామాన్యుడు తిరగబడ్డాడు. మీరు ఎలా వాహనాలను చెకింగ్ చేస్తారని, నీ పేరేంటని ఓ వ్యక్తి గట్టిగా ప్రశ్నించడంతో ఏం చెప్పాలో అర్థంకాక బిత్తర చూపులు చూస్తూ పోలీస్ స్టేషన్‌కు రండి అంటూ వెళ్లిపోయారు కానిస్టేబుళ్లు. కానిస్టేబుళ్ల యూనిఫాంకు నేమ్ ప్లేట్లు కూడా లేకపోవడంపై నిలదీశాడు వీడియో తీసిన వ్యక్తి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

CommonMan
Police
Khammam

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు