నన్ను రేప్ చేశారు.. రాహుల్ షాకింగ్ పోస్ట్

Submitted on 21 January 2020
Comedian Rahul Ramakrishna Shocking Tweet

టాలీవుడ్ యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ రీసెంట్‌గా చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సైన్మా’ అనే షార్ట్ ఫిలింతో ఆకట్టుకుని, ‘అర్జున్ రెడ్డి’, ‘భరత్ అను నేను’ ‘గీత గోవిందం’ వంటి సినిమాలతో కమెడియన్‌గా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ.

తాజాగా త‌న వ్య‌క్తిగ‌త విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా చెప్పి సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌న క్రియేట్ చేశాడు.. త‌న‌ను చిన్న‌ప్పుడు రేప్ చేశార‌ని, ఇన్నాళ్లూ ఆ బాధ‌ను ఎవ‌రితో పంచుకోవాలో తెలియ‌లేద‌ని అందుకే ట్విట్ట‌ర్ ద్వారా పంచుకుందామ‌ని ఈ పోస్ట్ చేస్తున్న‌ట్లు తెలియ‌జేశాడు.

Read Also : క్రిష్ దర్శకత్వంలో పవన్ పీరియాడిక్ డ్రామా

ఇలా ఇత‌రుల‌తో తన వ్యక్తిగత విష‌యాల‌ను పంచుకోవ‌డం ద్వారా తనేంటో తెలుసుకోగ‌లుగుతున్నాన‌ని అన్నాడు రాహుల్. ఈ విష‌యం తెలుసుకున్న నెటిజన్స్ షాక‌వుతున్నారు.. 
 ఇటీవల ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ప్రేక్షకులను అలరించిన రాహుల్.. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’, ‘విరాటపర్వం’, ‘జాతి రత్నాలు’, ‘గుడ్ లక్ సఖి’ సినిమాలు చేస్తున్నాడు.
 

Rahul Ramakrishna
Tollywood Comedian
Shocking Tweet

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు