23వేల ఉద్యోగులను తీసుకోనున్న కాగ్నిజెంట్

Submitted on 8 November 2019
Cognizant to hire 23,000 engineering talent in 2020

ఐటీ అగ్రస్థాయి కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ 23వేల మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఉపాధి కల్పించనుంది. 2020వ సంవత్సరం క్యాలెండర్ ఇయర్‌లో టాలెంట్ ఉన్న వ్యక్తులను ఒడిసి పట్టుకుని తమ కంపెనీల్లో ఉద్యోగాలిస్తామని కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ రామ్మూర్తి గురువారం ప్రకటించారు. బీపీఓల ద్వారా పలు క్యాంపస్‌లకు వెళ్లి అక్కడే ఎంపిక చేసుకుంటామని వెల్లడించారు. 

చెన్నైలోని సీఐఐ ఫ్లాగ్ షిప్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) వేదికగా ఐటీ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ మాట్లాడారు. కాగ్నిజెంట్ కంపెనీ ఇండియాలో ఉద్యోగవకాశాలు కల్పించేదానిలో ముందుంది. 2014-2018 మధ్య కాలంలో 66వేల మందికి ఉపాధి కల్పించింది. 2019ఆరంభం 9నెలల్లోనూ కాంట్రాక్ట్ కింద కొందరిని తీసుకున్నాం. ఇక 2020 సంవత్సరం నుంచి ఫ్రెషర్లను తీసుకోవాలనుకుంటున్నాం.  

సంస్థ ఎదగాలనే ఉద్దేశ్యంతోనే కొద్ది రోజుల ముందు కాగ్నిజెంట్ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారిలో 2శాతం తీసేయడం చాలా ధైర్యంతో కూడుకున్న పనే. సెప్టెంబరు నాటికి కాగ్నిజెంట్ సంస్థలో 2లక్షల 89వేల 900మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 2/3వ వంతు భారత్ నుంచే కావడం విశేషం. 

Cognizant
engineering talent
Hiring
mega hiring

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు