కల్లుకుండలో నాగుపాము

Submitted on 8 November 2019
Cobra snake in pot

పుట్టలోకి వెళ్లాల్సిన నాగు పాము.. కల్లు కుండలోకి చేరిన ఘటన.. కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. హుజురాబాద్ తాటి వనంలో కొమురయ్య అనే గీత కార్మికుడు కల్లు గీసేందుకు సిద్ధమవుతుండగా కుండలో పాము బుసకొడుతూ.. కనిపించింది.

పామును చూసిన కొమరయ్య  ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ఒకవేళ అజాగ్రత్తగా కుండలో చేయి పెట్టినా.. చెట్టెక్కి కల్లు గీసేటప్పుడు పాము బయటకొచ్చినా ప్రాణానికే ముప్పు వచ్చేదంటున్నారు స్థానికులు.


 

Cobra snake
pot
Karimnagar

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు