అమ్మకొట్టిందని ఆత్మహత్యాయత్నం : సుద్దులు చెప్పిన  సీఎం 

Submitted on 12 January 2019
CM Kumaraswamy, a young man who committed suicide in Bangalore Metro Railway Station

బెంగళూరు : అమ్మకొట్టిందని అలిగిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన ట్రైన్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయటంతో బతికి బైటపడ్డారు. అమ్మ కొట్టిందనీ..నాన్న తిట్టాడనీ..ఎగ్జామ్ ఫెయిల్, లవ్ ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలకు పాల్పడటం సర్వసాధారణంగా మారిపోయింది. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు కాలేజ్ కు లేట్ గా వెళ్తున్నాడనీ తెలుసుకున్న తల్లి కుమారుడ్ని తీవ్రంగా మందలించింది...ఎందుకు ఆలస్యంగా వెళ్తున్నామని అడిగినదానికి సరిగ్గా సమాధానం చెప్పకపోవటంతో కోపం వచ్చిన తల్లి కొట్టింది. దీంతో మనస్తాపానికి గురైన సదరు యువకుడు బెంగళూరులోని మెట్రో స్టేషన్ కు చేరుకుని రైలు వచ్చేవరకూ ఎదురుచూసి ట్రైన్ దగ్గరకు వస్తుండటం ఒక్కసారిగా పట్టాలపైకి దూకేశాడు. దూరం నుండే యువకుడిని గమనించిన మెట్రో డ్రైవర్ మదివలప్ప ట్రైన్ కు  సడెన్ బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది. కానీ తలకు చిన్నపాటి గాయం అయ్యింది. 

మెట్రో అధికారులు వెంటనే యువకుడిని బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కుమారస్వామి ఓ కార్యక్రమం నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన క్రమంలో చికిత్స పొందుతున్న యువకుడిని కర్ణాటక సీఎం కుమారస్వామి పరామర్శించారు. చిన్నచిన్న విషయాలకే తొందరపడి ప్రాణాలు తీసుకోవడం సరికాదని..చక్కగా చదువుకోవాలని  సూచించారు.
 

karnataka
Bangalore
Metro Station
Yangster
Suicide
CM
Kumaraswamy

మరిన్ని వార్తలు