రేపు తిరుమలకు కేసీఆర్

Submitted on 25 May 2019
CM KCR Visit Tirupati Tomaroow

తెలంగాణ సీఎం కేసీఆర్ సతీసమేతంగా మరోసారి తిరుమలకు వెళ్లనున్నారు. మే 26వ తేదీ ఉదయం ఆయన కుటుంబసభ్యులతో కలిసి తిరుపతికి చేరుకుంటారు. తర్వాత శ్రీ వారిని దర్శించుకోనున్నారు కేసీఆర్. డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం..రెండోసారి సీఎంగా కేసీఆర్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత కొద్దిరోజుల కిందట పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. ఏపీ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది వైసీపీ పార్టీ. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే..తిరుమలకు వచ్చి మొక్కు చెల్లించుకుంటానని ప్రజల తరపున ఆనాడు కేసీఆర్ మొక్కుకున్న సంగతి తెలిసిందే. 2017 సంవత్సరంలో శ్రీ వారికి రూ.5 కోట్ల విలువైన ఆభరణాలను మొక్కుగా చెల్లించారు కేసీఆర్. 
 

CM KCR
Visit
Tirupati
Tomaroow
Jagan News
KCR Family

మరిన్ని వార్తలు