ఆర్టీసీ కార్మికులతో లంచ్ చేస్తున్న సీఎం కేసీఆర్

Submitted on 1 December 2019
CM KCR, Lunch with TSRTC workers

తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ చేస్తున్నారు. 2019, డిసెంబర్ 01వ తేదీన ఆదివారం ప్రగతి భవన్‌కు కార్మికులు చేరుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల నుంచి కార్మికులు ఇక్కడకు వచ్చారు. ప్రతి డిపో నుంచి ఐదుగురికి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు మహిళా కార్మికులు ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఎండీని సూచించారు. లంచ్ అనంతరం వీరందరితో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. వీరితో పాటు ఆర్టీసీ ఈడీలు, ఆర్ఎంలు, డీఎంలు కూడా మీటింగ్‌లో పాల్గొననున్నారు. 

అక్టోబర్ 04వ తేదీ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. పలు పరిణామాల మధ్య నవంబర్ 29వ తేదీ శుక్రవారం నుంచి కార్మికులు విధుల్లో చేరవచ్చని తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్మికులతో తాను ప్రత్యేకంగా సమావేశం అవుతానని, ఆర్టీసీని సంరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. లాభాలబాటలో వచ్చే విధంగా అనుసరించాల్సిన విధానాలు, ఇతరత్రా వాటిపై వారితో చర్చిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. యూనియన్ నేతల మాటలను నమ్మి మోసపోవద్దని కూడా సూచించారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులతో ఏఏ అంశాలు చర్చిస్తున్నారనేది కొద్ది సేపట్లో తెలియనుంది. 
Read More : ప్రాణహిత నదిలో పడవ బోల్తా..ఆఫీసర్లు గల్లంతు 

CM KCR
Lunch
TSRTC
WORKERS
Road workers

మరిన్ని వార్తలు