ట్రంప్‌తో డిన్నర్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అరుదైన ఆహ్వానం

Submitted on 22 February 2020
cm kcr to attend donald trump dinner

తెలంగాణ సీఎం కేసీఆర్ కు అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందుకు కె.చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి విందు ఇస్తున్నారు. ఇందులో కేసీఆర్ పాల్గొననున్నారు. విందు కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్ కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం.

రెండు రోజుల భారత పర్యటన కోసం ట్రంప్.. తన భార్య, కూతురుతో కలిసి భారత్‌కు రానున్నారు. ఫిబ్రవరి 24న భారత్ వస్తారు. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం అందింది. కాగా, ఈ విందుకు కేవలం 90 నుంచి 95 మంది గెస్టులను మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేవలం కొద్దిమంది కేంద్ర మంత్రులకే ఇన్విటేషన్స్ అందాయి.

దేశవ్యాప్తంగా 8మంది సీఎంలకు మాత్రమే ఆహ్వానం అందింది. అసోం, హర్యానా, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ కలిపి మొత్తం 8 మంది ముఖ్యమంత్రులకు మాత్రమే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానాలు వెళ్లినట్టుగా తెలుస్తోంది. విందులో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 24న ఢిల్లీకి వెళ్తారని సమాచారం.

Read More>>అచ్చెన్నాయుడు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు: విజిలెన్స్ అధికారుల చేతిలో సిఫార్సులేఖ

See Also>>హైదరాబాద్‌లో రోహింగ్యాలు : ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు..అడ్డుకున్నMIM నేత

CM KCR
dinner
donald trump
america president
Ramnath Kovind
India tour
president invite

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు