బాబు ఢిల్లీ పోరు : ప్రజాకోర్టులో మోడీకి బుద్ధిచెబుతాం

Submitted on 12 February 2019
CM Chandrababu demand for the status of specialty in Delhi

ఢిల్లీ : ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటు సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు (ఫిబ్రవరి 12)న ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ చంద్రబాబు  ర్యాలి చేపట్టారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో చంద్రబాబు భేటీ అయి ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలను నెరవేర్చాలని కోరుతు  వినతి పత్రం అందజేయనున్నారు. ర్యాలీలో పాదయాత్రగా బయలుదేరిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతు..ఏపీకి ప్రత్యేక హోదా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకూ పోరాటాన్ని ఆపేది లేదనీ..కేంద్రం న్యాయం చేయకపోతే కోర్టుకెళ్లతామని..అక్కడ కూడా న్యాయం జరగకపోతే ప్రజాకోర్టులో తేల్చుకుంటామని..బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ది చెబుతామని.. స్పష్టంచేశారు. 

 

11న జరిగిన ధర్మ పోరాట దీక్షకు దేశ వ్యాప్తంగా ప్రముఖులు..పార్టీల నేతలు..సీఎంలు మద్దతు తెలిపారనీ..ఏపీకి హోదా పోరుకు అందరు సహకరిస్తున్నారని తెలిపారు. కేంద్రం ఏపీని నమ్మించి మోసం చేసిందని..మా న్యాయమైన కోరికలు సాధించేంత వరకూ పోరాడతామని..అప్పటి వరకూ పోరాటం ఆపేది లేదనీ చంద్రబాబు స్పష్టంచేశారు. ఏపీ ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసిందనీ.. వారి జీవితాలతో ఆడుకుంటోందనీ..దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వైఎస్ ఎస్సార్ పార్టీ అధినేత జగన్ కు మోడీ ఒక్కటేననీ..జగన్ కేసులను మాఫీ చేయించుకోవటానికి మోడీకి ఊడిగం చేస్తున్నారనీ..అతనికి తన స్వార్ధమే తప్ప ప్రజల సంక్షేమంతో పనిలేదని తీవ్రంగా విమర్శించారు. తమకు కావాల్సింది రాజకీయ ప్రయోజనాలు కాదనీ..రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నామనీ చంద్రబాబు స్పష్టం చేశారు. 

Delhi
AP Bhavan
CM
Chandra Babu
President
Ram Nath Kovind
Rally

మరిన్ని వార్తలు