బౌలర్లకు నేనంటే భయం..కెమెరా ముందు చెప్పలేరు: క్రిస్ గేల్

Submitted on 22 May 2019
Chris Gayle says bowlers are afraid of him

వెస్టిండీస్ 39ఏళ్ల క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ అంటే బౌలర్లకు హడల్ అని తానే చెప్పుకున్నాడు. ఈ విషయాన్ని బౌలర్లు కెమెరా ముందు చెప్పలేకపోతున్నారని అంటున్నాడు. కొద్ది రోజుల్లో మొదలుకానున్న వరల్డ్ కప్‌ 2019కు వెస్టిండీస్‌ జట్టుకు వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగనున్న గేల్.. బలాబలాల గురించి ఈ విధంగా చెప్పుకొకచ్చాడు. 

'ప్రతి ఒక్కరికీ యూనివర్సల్ బాస్ ఏం చేయగలడో తెలుసు. క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అని అందరూ అనుకుంటారు. వాళ్లను కెమెరా ముందు అడిగితే కచ్చితంగా కాదనే సమాధానం చెబుతారు. కెమెరా వెనుక వాళ్లను ప్రశ్నిస్తే.. కచ్చితంగా నిజమేనని చెప్తారు. వాళ్లు నిజం చెప్పలేకపోతున్నారు. నా మాట వినండి' అని వెల్లడించాడు. 

'అభిమానుల ముందు నిజం చెప్తున్నా. ఇది గేమ్‌పై నాకున్న ప్రేమ. ఒకానొక సమయంలో క్రికెట్ వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఎంజాయ్ చేస్తున్నంత కాలం ఆటను వదలాల్సిన అవసర్లేదు. అభిమానులు ఎప్పుడూ సిక్సులు కోరుకుంటారు. అవే మనల్ని అంచనాలకు మించి ఆడేలా ప్రేరేపిస్తాయి. ఇప్పుడు నిరూపించడానికి ఏమీ లేదు. కేవలం వరల్డ్ కప్ గెలుచుకోవడమే మిగిలి ఉంది' అని క్రిస్ గేల్ ముగించాడు. 

chris gayle
west indies
world cup 2019
2019 icc world cup
2019 Cricket World Cup

మరిన్ని వార్తలు