పాండీ బజార్‌లో చూసిన మూర్తే.. ఇంకా మారలేదు: చిరంజీవి

Submitted on 21 May 2019
Chiranjeevi Speech at R Narayana Murthy's Market Lo Prajaswamyam Pre Release

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఆర్.నారాయణమూర్తికి విలక్షణ వ్యక్తిత్వం ఉందని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’ సినిమా ఆడియో రిలీజ్, ప్రి-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన చిరంజీవి... తనను సైరా సెట్‌కు వచ్చి నారాయణమూర్తి పిలిచినప్పుడు ఆఫ్ బీట్ గా అనిపించిందని, విలక్షణమైన నటుడు, దర్శకుడు అయిన నారాయణ మూర్తి తనని అభిమానంతో పిలవడం సంతోషంగా అనిపించిందని చిరంజీవి అన్నారు. నారాయణమూర్తి తనను ఆహ్వానించినప్పుడు ఆశ్చర్యపోయానని, నాలుగు రోజులు కింద సైరా సెట్‌కు  వచ్చి నన్ను పిలవడం సంతోషంగా ఉంది అని అన్నారు. తన కుటుంబ సభ్యుడి ఫంక్షన్‌కు వచ్చినట్టుగా ఉందని అన్నారు చిరంజీవి.

నారాయణమూర్తితో తనది నాలుగు దశాబ్దాల పరిచయం అని, “1978లో ప్రాణం ఖరీదు చేస్తున్నప్పుడు.. నూతన్ ప్రసాద్‌కు అసిస్టెంట్‌గా  ఓ చిన్న పాత్రలో కుర్రాడిగా నారాయణమూర్తి నటించాడు. అప్పటినుంచి స్నేహం కొనసాగింది. ఇప్పటివరకు తాను నమ్మినబాటలోనే నడిచి డెడికేటెడ్ అంటే ఏంటో చూపించాడు నారాయణమూర్తి. ఆయనది నిఖార్సైన మనస్తత్వం. సినిమాపైన ఎంతో ప్యాషన్ చూపిస్తుంటారు. ఈ స్థాయికి రావడానికి కారణం ఆయన అంకితభావమే. నటుడుగా, నిర్మాత, దర్శకుడిగా 30 సినిమాలు చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తి” అన్నాడు చిరంజీవి.

“కమర్షియల్ గా ఎవరైనా ఆకర్షితులవుతారు.. కానీ నారాయణమూర్తి అవ్వడు. టెంపర్ సినిమాలో.. మూర్తి క్యారెక్టర్‌ను పూరీ జగన్నాథ్ ఇస్తే.. కమర్షియల్ గా తాను న్యాయం చేయలేననీ.. వద్దు అంటూ నో చెప్పడం నారాయణమూర్తి గొప్పతనం. ఆయనకు కమిట్ మెంట్ ఉంది.. కానీ కమర్షియాలిటీ లేదు. నారాయణమూర్తి వ్యక్తిగత జీవితం చాలా సాధారణంగా ఉంటుంది. పాండీబజార్‌లో ఆనాడు తెల్లబట్టలు వేసుకుని.. హవాయి చెప్పులు, భుజానికి సంచితో నడుచుకుంటూ వెళ్లేవాడు. ఇప్పటికీ నారాయణ మూర్తి అలాగే ఉన్నాడు. మానసికంగా మారలేదు. నారాయణమూర్తి ఓ యోగి లాంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు.. సినిమా ఇండస్ట్రీలో ఎంత వెతికినా దొరకరు” అని చెప్పారు చిరంజీవి.

Chiranjeevi Speech
R Narayana Murthy
Market Lo Prajaswamyam
Pre Release Event

మరిన్ని వార్తలు