గాల్లో తేలిపోతూ జర్నీ : డ్రైవర్ లెస్ Sky Train చూశారా?

Submitted on 29 April 2019
 China unveils new Transparent desing for Driverless Sky Train New Type of Suspension Railway

ప్రపంచవ్యాప్తంగా సరికొత్త టెక్నాలజీ తో వచ్చిన ఎన్నో బుల్లెట్ ట్రైన్లు చూశాం.. ఇప్పుడు స్కై ట్రైన్లు కూడా వచ్చేశాయి. ఈ ట్రైన్లకు డ్రైవర్ అక్కర్లేదు. ఆకాశంలో స్పీడ్ గా దూసుకెళ్తాయి. ఎటు చూసినా అద్దాలే. బయట ప్రపంచాన్ని చూస్తూ థ్రిలింగ్ ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎక్కడో కాదు.. చైనాలో సరికొత్త టెక్నాలజీతో ఈ డ్రైవరల్ లెస్ స్కై ట్రైన్లను ఆవిష్కరించారు. బుల్లెట్ ట్రైన్లకు ధీటుగా ఈ స్కై ట్రైన్లు అదే వేగంతో దూసుకెళ్తున్నాయి.
Also Read : గిఫ్ట్ విసిరికొట్టాడు : పక్కనే పెళ్లికూతురు.. PUBGతో పెళ్లికొడుకు ఫుల్ బిజీ

రోజురోజుకీ ప్రయాణికుల రద్దీ పెరిగిపోతున్నక్రమంలో న్యూ టైప్ సస్పెన్షన్ ట్రైన్లపై అక్కడి రైల్వే బోర్డు దృష్టిపెట్టింది. న్యూ ట్రాన్స్ పరెంట్ డిజైన్, సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన ఈ లేటెస్ట్ స్కై ట్రైన్ ను మార్చి 2 చైనాలోని చెంగ్డూ నగరంలో ఆవిష్కరించారు. దేశంలోనే ఫస్ట్ పబ్లిక్ సస్పెన్షన్ రైల్వే లైన్ గా చెప్పవచ్చు. అప్ డేటెడ్ వెర్షన్ తో డ్రైవర్ లేకుండా రూపొందించిన సస్పెండెడ్ ట్రైన్.. ఇందులో మూడు వైపుల క్యారేజీ చేసేలా ట్రాన్స్ పరెంట్ ప్యానెల్ గ్లాస్ లతో డిజైన్ చేశారు. లిథియం బ్యాటరీ పవర్ తో నడిచే ఈ స్కై ట్రైన్.. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

ట్రాక్ కింద నుంచి మిడ్ ఎయిర్ లో ఈ ట్రైన్ మూవ్ అవుతుంది. చూడటానికి తల కిందులుగా ట్రైన్ వెళ్తుందా? అనే అనుభూతి కలుగుతుంది. ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాల్లో తేలిపోతున్నట్టుగా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఈ ట్రైన్ లో 8 మీటర్ల వరకు ఉన్న గ్రౌండ్ లో మొత్తం 230 మంది ప్రయాణికుల వరకు ప్రయాణించవచ్చు. ఇలాంటి సరికొత్త టెక్నాలజీతో కూడిన సస్పెన్షన్ రైల్వే లైన్లు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి.

అయినప్పటికీ చైనా రూపొందించిన ఈ అప్ డేటెడ్ వెర్షన్ స్కై ట్రైన్ లో ట్రాన్స్ పరెంట్ స్రక్చర్ తో పాటు గ్రౌండ్ నుంచి వెళ్లేలా రూపొందించారు. ఈ స్కైన్ ట్రైన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్కై ట్రైన్ చూసిన నెటిజన్లు.. ఇండియాలో కూడా ఇలాంటి టెక్నాలజీతో కూడిన స్కై ట్రైన్లు వస్తే ఎంతో కూల్ గా ఉంటుంది కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read : అదృష్టం వెన్నంటే ఉంటే : రెండు బాంబు దాడుల నుంచి బతికి బయటపడ్డాడు
 

Driverless Sky Train
Suspension Railway
China unveils sky train
Chengdu City
China

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు